కాంగ్రెస్ పార్టీలో భారీగా విస్తరణ

– ఏఐసీసీ అధికార ప్రతినిధిగా మధుయాష్కీ, సినీ నటి కుష్బూ

న్యూఢిల్లీ, మార్చి 20: ఏఐసీసీ అధికార ప్రతినిధిగా రాష్ర్టానికి చెందిన మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌కు ఎంపికయ్యారు. మంగళవారం కొత్తగా అధికార ప్రతినిధులు, టెలివిజన్ ప్యానలిస్ట్‌లను ఎంపిక చేస్తూ కాంగ్రెస్ భారీగా విస్తరణ చేపట్టింది. సీనియర్ అధికారప్రతినిధులుగా అజయ్ మాకెన్, సీపీ జోషి, సత్యవ్రత్ చతుర్వేది, షకీల్ ఆహ్మద్‌లను నియమించింది. టెలివిజన్ ప్యానలిస్ట్ జాబితాలో రాష్ట్రపతి ప్రణబ్ కుమార్తె శర్మిష్ఠకు చోటు కల్పించారు. జాబితాలో నలుగురు సీనియర్ అధికార ప్రతినిధులు, మరో 17 మంది అధికార ప్రతినిధులు, సినీనటి కుష్భూకు స్థానం దక్కింది. కమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్ ఇన్‌చార్జి హోదాలో అధికార ప్రతినిధుల బృందానికి రణదీప్ సింగ్ సుర్జేవాలా నాయకత్వం వహిస్తారు.

This entry was posted in News.