“సోనియానే మా దేవత” తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ ల వ్యాఖ్య

ఈనాడు.న్యూడిల్లీ. పార్లమెంట్ సమీపంలోని విజయచౌక్ గురువారం రాత్రి తెలంగాణ నేతల
సంబరాలకు వేదికైంది. ఆ ప్రాంత లోక్ సభ రాజ్యసభ ఎంపిలంతా ఇక్కడికి చేరి సంతోషంతో
కేరింతలు కొట్టారు.మిఠాయిలు పంచుకుంచుకుంటూ,ఆలింగనం చేసుకుంటూ ఒకరికోకరు
శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ఎంపిలు పోన్నం ప్రభాకర్,మధుయాష్కి గౌడ్,సురేస్ షెట్కర్
గుత్తా సుఖేందర్ రెడ్డి ,కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి,రాజయ్య, కేంద్ర సహాయ మంత్రి భలరాంనాయక్ తధితరులంతా విజయచౌక్ ను నినాదాలతో హోరిత్తించారు.
ఈ సందర్బంగా ఎంపిలు మాట్లాడుతూ…నాలుగున్నర కోట్ల ప్రజల కలలు సాకారం చేసిన
సోనియాగాంధి, రాహుల్ గాంధి, ప్రధామమంత్రి మన్మోహన్ సింగ్ లకు తెలంగాణ ప్రజల తరుపున క్రుతజ్ఞతలు తెలుపుకుంటున్నామని ప్రకటించారు.ప్రాతాల వారీగా విడిపోయినా
అన్నధమ్ముల్లా కలిసుందామని, ఇరుప్రాంతాల అభివ్రుద్దికి క్రుషి చేద్దామని సీమాంద్ర ప్రజలకు
పిలుపునిచ్చారు.తెలంగాణ కోసం అమరులైన వారికి ఈ విజయం అంకితమన్నారు.తెలంగాణ
ప్రజలు సోనియా గాంధికి జన్మ జన్మలకు రుణపడి ఉంటారని తెలిపారు.అమరులకు ఇచ్చినమాట నిలబెట్టుకోగలిగామని ,ఇందుకు సహకరించిన ఉధ్యోగ,విధ్యార్ది,రాజకీయ
ఐకాసలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు. తెలంగాణ ప్రజలు సోనియా గాంధి ని
ధేవతలా ఫూజిస్తారని, ఆమె తెలంగాణ తల్లి అని, తెలంగాణ తరుపున ఎంపిలమంతా సోనియాకు పాధాభివందనాలు తెలుపుకుంటున్నామని చెప్పారు

This entry was posted in News.