జాప్యం చేసే కుట్రతొనే తెరపైకి రాయల మాట

ఆర్మూర్. డిసెంబర్ 1, (టి మీడియా)
తెలంగాణ ఏర్పాటు రాజ్యాంగపరంగా పూర్తయిన తరుణంలో జాప్యం చేసె కుట్రతో తెరపైకి రాయల తెలంగాణ
ప్రతిపాదన తెస్తున్నారని ఎంపి మధుయాష్కి ఆరొపించారు.ఆదివారం నిజామాబద్ జిల్లా ఆర్మూర్ లో ఆయన మాట్లాడారు.శీతాకాల సమావేశాలలో బిల్లురాకుండా అడ్డుకునే కుట్ర జరుగుతోందని,ఆపలేని స్థితిలో రాయల తెలంగాణ అంశాన్ని తెచ్చారన్నారు. మంగళవారం జీవోఎం పైనల్ మీటింగ్ ఉన్నందున,4న క్యాబినెట్ లో ఆమోదం లబించనున్నందున ఆఖరిపోరాటానికి ఎంపీలం డిల్లి వెళ్లుతున్నామన్నారు.అసెంబ్లిలో సి.యం కూర్చున్నా తెలంగాణ తీర్మానం జరుగుతుందన్నారు.రాయల తెలంగాణకు తాను అనుకూలం కాదని కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి స్పష్టం చేశారని,తెలంగాణను అడ్డుకునే కుట్రలో బాగంగానే జైపాల్ రెడ్డిపై ఆరోపణలు
చేస్తున్నారన్నారు. ఎంపి రేణుక వంటి వారు తెలంగాణకు ద్రోహం చేసే రీతిలో కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. మహబూబ్ నగర్ తో పాటు నిజామాబాద్ ను వెనుకబడ్డ జిల్లాగా గుర్తించారని,తెలంగాణ
పునర్నిర్మాణంలో ప్రణాళికతో అబివ్రుద్ది జరుతుందన్నారు. టి.డి.పి., బి.జె.పి ల గందర్వవివాహం పూర్తయిందని,
త్వరలో ప్రజల ముందు ఆ వివాహ ఘట్టం బయట పడుతుందన్నారు.

This entry was posted in News.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *