భద్రాద్రి, మునగాల మాదే

న్యూఢిల్లి. నవంబర్ 19, (టి మీడియా)
• తీసివేతలు కుదరవు. తెలంగాణ వాదులు,నేతల స్పష్టీకరణ
• జీవోఎం సభ్యులతొ టి కాంగ్రెస్ నేతల సమావేశం
• సొనియాను కలిసిన కేంద్రమంత్రి బలరాంమ్ నాయక్
• నేడు జీవోఎం సభ్యులతొ ప్రజా,విద్యార్ది,బిసి సంఘాల జేఏసి ల బేటి

ఖమ్మం జిల్లా లొని భద్రాచలం, నల్లగొండ జిల్లాలోని మునగాల ప్రాంతాలు ముమ్మాటికి తెలంగాణలో అంతర్బాగమేనని తెలంగాణ వాదులు,నేతలు స్పష్టం చేస్తున్నారు.వీటిని వేరు చేయాలని చూస్తే.. తెలంగాణను మించిన ఉద్యమం చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.ఈమేరకు ఢిల్లిలో టి కాంగ్రెస్ నేతలు, తెలంగాణ ప్రజా,విద్యార్ది,బిసి సంఘాల జేఏసి నేతలు.సీమాంద్ర నాయకులు కుట్రలను అడ్డుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.

జీవోఎం సభ్యులతొ టి కాంగ్రెస్ నేతలు
టి కాంగ్రెస్ ఎంపీలు మధుయాష్కీ ,పొన్నం ప్రభాకర్,సిరిసిల్ల రాజయ్య, సురేశ్ షెట్కర్.
నార్త్ బ్లాక్ లోని హొంమంత్రిత్వ శాఖ కార్యాలయంలొ తెలంగాణ బిల్లుకు తుదిమెరుగులు
దిద్దె పనిలో ఉన్న షిండే,జైరాంరమేష్ తొ మంగళవారం సమావేశం అయ్యారు. భద్రాచలం, మునగాలను తెలంగాణ నుంచి విడదీయవద్దని వారు కోరారు.

This entry was posted in News.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *