కిరణ్ పై స్పీకర్ కు పిర్యాదు చేస్తాం. మధుయాష్కి

సాక్షి.న్యూడిల్లీ. రాష్ట్ర పునర్ వ్యవస్తీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ రాజీనామా చేసిన కిరణ్ కమార్ రెడ్డి పార్లమెంట్ ను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని, ఆయన పై సభా హక్కుల ఉల్లంఘన క్రింద చర్యలు తీసుకోవాలని లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ కు పిర్యాదు చేస్తామని కాంగ్రెస్ ఎంపి మధుయాష్కి గౌడ్ తెలిపారు.బిల్లును ప్రవేశ పెట్టేక్రమంలో పార్లమెంటులో దొంగల్లా వ్యవహరించారని కిరణ్ చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్ ను కించపరిచేలా ఉన్నాయన్నారు. గురువారం సాయంత్రం ఇక్కడ విజయ్ చౌక్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ అదినేత్రి సోనియా దయతో ముఖ్యమంత్రి అయిన కిరణ్ తల్లి పాలు తాగి రోమ్ము గుద్దారని
విమర్శించారు.ఆయనకు సీమాంద్ర ప్రజలే భుద్ది చెబుతారన్నారు.

This entry was posted in News.