తెలంగాణ ప్రజలకు ఇలవేల్పు సోనియా.యాష్కి

ఎన్నో ఏళ్ల రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన సోనియా గాంధీ తెలంగాణ ప్రజల ఇలవేల్పు అని ఎం.పి.మదుయాష్కి కొనియాడారు.శుక్రవారం జంతర్ మంతర్ లొ తెలంగాణ ప్రజాసంఘాల ఐకాస చైర్మన్ గజ్జెల కాతం ఆద్వర్యంలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధికి ప్రజా అభినందన సభ జరిగింది.ఈ కార్యక్రమంలో ఎం.పి.మధుయాష్కి, ఎమ్మెల్సీ.పొంగులేటి.సుధాకర్ రెడ్డి,స్వాతంత్ర సమరయోదులు వి.చంద్రారెడ్డి,కొలను శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా మధుయాష్కి ప్రసంగిస్తూ రాష్ట్ర విభజన జరిగి పోయిందని,ఇక తెలంగాణను ఎవరు అడ్డుకోలేరని ,ఉద్యమాల వల్ల ఫలితం ఉండదన్నారు.తెలంగాణ నోట్ ఆమోదంతో రాజ్యాంగ బద్దంగా రాష్ట్ర విభజన ప్రక్రియకు మొదటి అడుగు పడిందని తెలిపారు. విభజనకు అనుకూలంగా నిర్ణయం వెల్లడించిన సోనియాగాంధికి తెలంగాణ ప్రజల తరుపున క్రుతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు.ఇప్పటికే రాజకీయ సన్యాసిగా మారిన లగడపాటి కొత్తగా రాజకీయ సన్యాసం చేయాల్సిన పనిలేదన్నారు.సీమాంద్ర నేతలంతా సోనియా బిక్షతోనే కేంద్రమంత్రులయ్యారని గుర్తు చేశారు.తెదేపా అధినేత చంద్రబాబు ఓట్ల కోసమే నాటకాలు ఆడుతున్నారని, సమైక్యాంద్ర కోసం జగన్ జైలులో దీక్ష చేసినా,బయట చేసినా తేడా ఏమీ ఉండదని ఎధ్దేవా చేశారు.గజ్జెల కాంతం మాట్లాడుతూ…జగన్ హైదరాబాద్ లో సభ పెడితే ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.ఓయూ.విద్యార్దుల ఐకాస నేత పిడమర్తి రవి మాట్లాడుతూ…విభజనలో తెలంగాణ విద్యార్దులు కీలక పాత్ర పోషించారన్నారు.

This entry was posted in News.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *