పది జన్మలెత్తినా తెలంగాణాను అడ్డుకోలేరు

పాలమూరు అక్టోబర్ 27 (టి.మీడియా).తెలంగాణ రాష్ఱ్ర ఏర్పాటు ప్రక్రియ ఎప్పుడో జరిగిపోయింది. కేవలం
అధికారికంగా మాత్రమే ప్రక్రియ పూర్తి కావలసిఉంది.ఓ వైపు తండ్రి శవం ఉండగానే అధికారం కోసం పాకులాడిన జగన్, అడ్డదారిలో అధికారం అనుభవించి మరోమారు అధికారం చేజిక్కించుకునేందుకు కుట్రలు పన్నుతున్న చంద్రబాబు పన్నాగాలు,పెట్టుదారుల ప్యాకేజీలతో అశోక్ బాబు లాంటి వారు చేస్తున్న క్రుత్రిమ
ఉధ్యమాలు ప్రత్యేక రాష్ట్ర ప్రక్రియను ఎంత మాత్రం అడ్డుకోలేవు అని నిజామాబాద్ ఎమ్.పి.మధుయాష్కి స్పష్టం చేసారు.ఆదివారం మహబూబ్ నగర్ లోని సుదర్శన్ పంక్షన్ హాల్ లో నిర్వహించిన గౌడ సమరబేరిలొ ఆయన ప్రసంగించారు.60 ఏళ్ళుగా తెలంగాణ ప్రజలు సాగిస్తున్న ఉధ్యమాలు,ప్రాణత్యాగాలను కేంద్రం గుర్తించి
రాష్ర్ట ఏర్పాటు ప్రక్రియకు ఎప్పుడో ఆమోదం తెలిపిందన్నారు.సోనియా త్యాగాలను గుర్తించకుండా అధికారం కోసమే రాష్ట్రాన్ని విబజిస్తున్నారని ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

This entry was posted in News.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *